జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు శాస్త్రీయ సర్వేను ఆపాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను నిరాకరిచిన సుప్రీం.. సర్వేను ‘నాన్-ఇన్వేసివ్ టెక్నిక్’లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు.. 17వ శతాబ్ది నాటి మసీదులో వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపారు. అయితే హిందూ ఆలయం స్థానంలో ఈ కట్టడాన్ని నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించాలని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో మసీదు ప్రాంగణంలో సర్వే కొనసాగించుకోవడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏఎస్‌ఐ అధికారులు సర్వే చేపట్టారు.
Pawan Kalyan Serious on Janasena Leaders: జనసేన నేతలకు క్లాస్ పీకిన పవన్.. అది సమయం వృథా..!
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రార్థనా ప్రదేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఏఎస్‌ఐ.. 500 ఏళ్ల నాటి చరిత్రను తిరగదోడాలని చూస్తోంది. ఇలా చేస్తే గత గాయాలను మళ్లీ తెరిచినట్టే’’ అని తెలిపింది. మరోవైపు పురావస్తు శాఖ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేయలేదని, నిర్మాణాలను ధ్వంసం చేయబోమని తెలిపారు.
Manik Rao Thackeray: ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోంది..
అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేను కొనసాగించొచ్చని పేర్కొంది. కానీ దానికి ఒక షరతు అని పేర్కొంది. ‘నాన్-ఇన్వేసివ్’ పద్ధతిలో సర్వే జరగాలని ఆదేశించింది. మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.