హైదరాబాద్ జవహార్‌నగర్ పీఎస్ పరిధిలోని బాలాజీనగర్ లో ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి.. చర్యలకు ఉపక్రమించింది.
Tantiram: ఇంట్రెస్టింగ్‌గా తంతిరం ఫస్ట్ లుక్
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను గవర్నర్ ఆదేశించారు.
Vijay Devarakonda: అదే జరిగితే.. హైవేపై సమంత పేరుతో ఇడ్లీ బండి పెట్టుకోవడమే
మద్యం మత్తులో ఓ కామాంధుడు యువతిపై దారుణానికి తెగబడ్డాడు. ఈ నెల 6న హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీనగర్ బస్టాప్ లో నిల్చుని ఉంది. ఈ క్రమంలో మారయ్య అనే వ్యక్తి ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన ఆ యువతి అతనిని దూరంగా నెట్టేసింది. దీంతో ఆ కీచకుడు ఆమెపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె బట్టలను చించి లాగేశాడు. ఆమె దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపై నగ్నంగా పడివున్నా పట్టించుకున్న వారు లేరు. అంతా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ కేసులో నిందితుడు మారయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడు చేసిన పనికి సహకరించిన తల్లి నాగమ్మను సైతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..