బీజేపీ మహిళా ఎంపీలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై అవిశ్వాస తీర్మనం సందర్భంగా జరిగిన చర్చ సమయంలో రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగించే సమయంలో అధికార సభ్యులవైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని.. ఇది సభలో ఉన్న మహిళా ఎంపీలను అగౌరవపరిచినట్టు అని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
Khushi: ఆ సినిమాను గుర్తుచేస్తున్న ఖుషి.. ఎక్కడో కొడుతున్నట్టే ఉందే.. ?
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు పట్ల బుధవారం సాయంత్రం ఆమే పత్రిక ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ లో.. రాహుల్ గాంధీ అసభ్య సంజ్ఞలతో మహిళా పార్లమెంట్ సభ్యుల పట్ల చిల్లరగా ప్రవర్తించడం అతని సంస్కారానికి నిదర్శనమని, రాహుల్ గాంధీ వ్యవహారం చూసి సభ్యసమాజం తల దించుకుంటుందని తెలిపారు.
PM Modi: శరద్ పవార్ ప్రధాని కాలేకపోవడంపై .. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ వ్యవహారం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా సమర్ధించుకోవడం మహిళల పట్ల ఆ పార్టీ విధానాలకు నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు. పార్లమెంటులో ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం, సంస్కారం లేకుండా ప్రవర్తించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. వెంటనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ.. దేశ ప్రజలకు, మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.