చేవెళ్లలో నిర్వహించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ ఏర్పాట్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతుకవచ్చని, రాష్ట్ర సంపదను అందరం సమానంగా పొందవచ్చని ఆశపడి పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామమన్నారు. కానీ బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఏమి రాకపోగా, ఉన్నవి కూడా కోల్పోతూ ఆందోళన చెందుతున్న ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు.
LIC New Plan : ఎల్ఐసీ సూపర్ ప్లాన్..ప్రతి ఏటా రూ.1,42,508 పెన్షన్.. ఎలాగంటే?
ఈ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుందని భట్టి విక్రమార్క అన్నారు. వెనుకబడిన చేవెళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 38వేల కోట్ల రూపాయలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, పరిగి, చేవెళ్ల తదితర నియోజకవర్గంలోని లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలన్న బృహత్తర ప్రణాళికను తయారుచేసి ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయించిన 38 వేల కోట్ల రూపాయల్లో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులను ముమ్మరంగా చేశామని పేర్కొన్నారు.
Punjab: రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తా.. పంజాబ్ సీఎంకు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్
పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, బడ్జెట్ నిధులు ఖర్చు పెట్టింది, పైగా ఐదు లక్షల కోట్ల అప్పు చేసింది. కానీ కృష్ణా, గోదావరి నదుల నుంచి అదనంగా చుక్క నీరు తీసుకురాలేదని భట్టి మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు రాలేదని భట్టి తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడెకరాల భూమి ఇస్తానని, ఇంటికో కొలువు ఇస్తామని, దళిత బంధు పేరిట పది లక్షలు ఇస్తామని, దళిత గిరిజనులను మోసం చేయడమే కాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ఇరువై రెండున్నర లక్షల ఎకరాలు భూములను బలవంతంగా వెనక్కి లాక్కొని బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతి ఎట్లా అవుతాడని ప్రశ్నించారు. ఆత్మగౌరవంతో తలెత్తుకొని దళిత గిరిజనులు బతకాలంటే అది కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమన్నారు.
Delhi : డెలివరి బాయ్ పై కత్తితో దాడి చేసిన మహిళ.. ఎందుకంటే?
దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అండగానే ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏం చేస్తుందో భవిష్యత్తు గురించి శనివారం జరిగే చేవెళ్ల సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటన చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం ఆశించి తెలంగాణ ఇచ్చింది? బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర సంపద ఎటు ఎలా అవుతుంది? తెలంగాణ సంపద ఎటు పోతుంది? అన్న విషయాలు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వివరించబోతున్నదని తెలిపారు. రాష్ట్ర సంపద, వనరులు ప్రజలకే చెందాలని విశ్వసించే ప్రజలు చేవెళ్లలో జరిగే ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.