ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో పడేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు రాహుల్. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు సీరియస్‌గా విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఇంకా ఏమైనా నెట్‌వర్క్ ఉండొచ్చని భావిస్తున్నారు. యూపీలో గత నెల రోజులుగా ఇలాంటి కేసులు అరడజనుకు పైగా తెరపైకి వచ్చాయి. అందువల్లే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rahul Sipliganj: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంపెనీలో పనిచేస్తుండగా రాహుల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహం పెరిగిందని.. ఓ రోజు తన గదికి తీసుకెళ్లాడని బాధితురాలు చెప్పింది. అక్కడ మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలు తనకు ఇచ్చాడని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత అత్యాచారం చేశాడని.. అంతేకాకుండా అసభ్యకరమైన ఫొటోలు, వీడియో తీసాడని బాధితురాలు తెలిపింది.
Read Also: Aditya L-1 Mission: సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ.. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
అయితే ఈ విషయంపై బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని రాహుల్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో నిందితుడు తాను పేరు రాహుల్ కాదని.. జహీర్ అని చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని నిందితుడు చెప్పుకొచ్చాడని బాధితురాలు తెలిపింది. ఇది వరకే నిందితుడికి పెళ్లి కాగా.. ఈ వ్యవహారం జహీర్ భార్యకు తెలిసింది. దీంతో బాధితురాలి ఫోన్ నంబర్‌ను గుర్తించి.. తనకు జహీర్‌కు వివాహమైనట్లు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. జహీర్ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడని చెప్పింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.