జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లులను కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ రుణన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని తెలిపారు. మీరు కట్టించిన ఇందిరమ్మ ఇండల్లో కేసీఆర్ ప్రభుత్వం వాటా ఉందని అన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని.. రైతులను ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదని ఆరోపించారు.
Read Also: Hyderabad: ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం.. అక్కా తమ్ముడిపై కత్తితో దాడి
బీడీ కార్మికులను పెన్షన్ తో ఆదుకున్నామని, ఆడబిడ్డలను ఓటు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే తెలిపారు. దళితులకు దళిత బంధు ఇచ్చి ఆదుకున్నామని.. ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లతో ఆదుకున్నామన్నారు. మహిళల ఓటు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. నేతన్నలను, గొల్ల కురుమ, గౌడ కులాన్నీ ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అందరూ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టి మద్యం మానేయాలని హితవు పలికారు.