Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నోటీసులు తీసుకోవటం అలవాటేనని దుయ్యబట్టారు. అవసరమైతే కోర్టులకు వెళ్తాడు.. స్టేలు తెచ్చుకుంటాడని ఆరోపించారు. చంద్రబాబు జీవితంలో స్టేలు.. దొంగతనాలు.. అబద్దాలు.. వెన్నుపోట్లతో ముందుకు వెళ్తున్నాడని తెలిపారు. ఏం జరగాలో అదే ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని మంత్రి మేరుగ పేర్కొన్నారు. ప్రజా బాహుళ్యంలో చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. చంద్రబాబు గుండెల్లో భయం ఉంది.. దాన్ని మేనేజ్ చేసుకుంటున్నాడని అని మేరుగ నాగార్జున అన్నారు.
Read Also: Kushi: ఖుషి సినిమాపై రేటింగ్స్ దాడి.. విజయ్ పై బూతుల వర్షం.. వెనకున్నది వారే?
చంద్రబాబు తప్పు చేయకుంటే ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పనేం ఉందని మంత్రి ప్రశ్నించారు. పురందీశ్వరినో, ఎవరో ఒకరివో కాళ్లు పట్టుకుని బీజేపీతో లైజనింగ్ చేయించుకుని కలిసి వెళ్లాలని చంద్రబాబు ఆలోచన అని మేరుగ అన్నారు. బీజేపీని అడ్డం పెట్టుకుని ఇరుక్కున్న అంశాల నుంచి బయటకు రావాలని చంద్రబాబు చూస్తున్నాడని మండిపడ్డారు. ఏపీలో తిరస్కరించబడిన వ్యక్తి చంద్రబాబు అని.. టీడీపీ రథచక్రాలు ఊడిపోయాయని, దొంగ ఓట్లకు ఆజ్యుడు చంద్రబాబు అని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Amit Shah: ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోంది.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై ఫైర్..
మరోవైపు కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతోనే గెలుస్తున్నాడని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. గత స్థానిక సంస్ధల ఎన్నికలు పకడ్బందీగా జరిగాయి కాబట్టే టీడీపీ ఓడిందని తెలిపారు. వైసీపీ దొంగ ఓట్లు తీసివేయాలని కోరితే చంద్రబాబుకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు. టీడీపీకి మరోసారి ఓటమి తప్పదని అర్థమైనందునే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మేరుగ మండిపడ్డారు..