సరదాలు, జోకులు, చిలిపి పనులు ఈ రోజుల్లో సర్వసాధారణం. ప్రజలు తరచుగా తమ స్నేహితులను లేదా భాగస్వాములను ఆటపట్టించడానికి చిలిపి పనులు చేస్తారు. అయితే కొన్నిసార్లు ఈ చిలిపితనం బెడిసికొడుతుంది. దాంతో ప్రజలు తీవ్రమైన పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో చాలా చిలిపి వీడియోలను చూసి ఉంటారు. సరదాగా ఆట పట్టిద్దామని అనుకుంటే.. వారికే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: #OG: పవన్ సినిమాలో మహేష్ క్యామియో.. హైప్ తో ఛస్తే ఎవర్రా రెస్పాన్స్ బిలిటీ.. ?
ఈ వీడియో చూసిన తర్వాత ఏ భర్త కూడా తన భార్యను చిలిపి చేసే ధైర్యం చేయడు. భర్త భార్యను ఆటపట్టించాలని గాఢనిద్రలో ఉన్న భార్యను వీడియోలో చూడవచ్చు. భర్త బెడ్ మీద ప్లాస్టిక్ కుర్చీ వేసి పడుకున్నాడు. అంతేకాకుండా తనపై ఒక షీట్ కూడా ఉంచాడు. తద్వారా అతను దెయ్యంలా గాలిలో వేలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆటపట్టించడం కోసం భర్త నిశ్శబ్దంగా కుర్చీలో పడుకుని భయంకరమైన శబ్దాలు చేయడం ప్రారంభించాడు. వ్యక్తి భయంకరమైన శబ్దాలు చేయడం ప్రారంభించిన వెంటనే, భార్య మేల్కొంటుంది.
Read Also: Udhayanidhi Stalin: కుల విభేదాలను మాత్రమే ఖండించా.. మళ్లీ మళ్లీ అదే చేస్తా..
నిద్ర లేవగానే భర్త ఉరివేసుకుని పడి ఉన్నాడని భార్య అనుకుని భయంతో కేకలు వేస్తుంది. దీంతో రిమోట్ మరియు దిండును తన భర్తపైకి విసిరేయడం ఈ వీడియోలో చూడొచ్చు. భర్త నిజంగా దెయ్యంగా మారాడని.. అతన్ని మంచంపై నుంచి కిందకు తోసి కొట్టడం ప్రారంభించింది. భార్య చెంపదెబ్బల వర్షం కురవడంతో భర్త లేవలేని స్థితిలో మంచం కిందనే పడి ఉన్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొన్నిసార్లు చిలిపి పనులు చేయడం ప్రమాదకరమని అర్థం చేసుకోవాలి. ఈ వీడియోను Fun Viral Vids అనే వినియోగదారుడు ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
https://twitter.com/Fun_Viral_Vids/status/1698377966831505544