సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ.. ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)ను కూడా లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్, TMC వంటి పార్టీలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు.
Read Also: Peddha Kapu: సలార్ లేడని పెదకాపు వస్తున్నాడు!
“తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్‌ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపింది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు. సనాతన ధర్మాన్ని గౌరవిస్తామని.. పూజలు చేసే పూజారులకు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. బెంగాల్‌లో దుర్గాపూజను పెద్ద ఎత్తున జరుపుకుంటామని.. గుళ్లు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలకు వెళ్తామని.. ప్రతి మతాన్ని గౌరవిస్తామని మమతా అన్నారు.
Read Also: China: కలవరపెడుతున్న హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత
మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై ఏమన్నారంటే.. పెద్ద, చిన్న వర్గాల ప్రజల మధ్య అసమ్మతిని కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ప్రతి ఒక్కరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.
అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష కూటమిలోని ఇతర పార్టీలపై కూడా బీజేపీ విమర్శలు చేస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.