AP BJP: ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తర్వాత బీజేపీ హైకమాండ్.. పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరీని ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులపై పురందేశ్వరి కసరత్తులు చేస్తోంది.
Read Also: iPhone: ఐఫోన్ వాడుతున్నారా.. ఇది అప్ డేట్ చేసుకోండి..!
రాష్ట్రంలో భారీగా జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 15 నుంచి 17 జిల్లాల్లో బీజేపీ అధ్యక్ష స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అధ్యక్ష స్థానాలను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశముంది. మరోవైపు జిల్లా అధ్యక్షులతో పాటు ఇంఛార్జులను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తుండగా.. సోము వీర్రాజు హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షుల్లో మార్పులు లేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Devineni Avinash: అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించలేని పలువురు నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాను ప్రకాష్ రెడ్డి, కునిగిరి నీలకంఠ, స్వర్ణాల మాలతీరాణి, బైరెడ్డి శబరి వంటి వారికి జిల్లాల బాధ్యతల అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా.. జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులతో పాటు.. జిల్లాల ఇంఛార్జిల్లోనూ మార్పులు ఉంటాయంటోంది. అయితే ఇదంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల కమిటీ నియామక కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.