Uttar Pradesh: పొలం పంచాయితీల్లో కొట్టుకోవడం చూశాం, డబ్బుల కోసం గొడవ పడటం చూశాం. కానీ కేవలం రూ.50 కోసం పుర్రెలు పగిలేటట్లు కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖిందౌడా గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also: Kushi Collections: తమిళనాట దుమ్ముదులుపుతున్న ఖుషి.. ఖుషి ఖుషీగా వసూళ్లు..
వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో నివసిస్తున్న మంజు దేవి అనే మహిళ.. రహాసుద్దీన్ అనే వ్యక్తి రూ.50 అప్పుగా తీసుకుంది. ఆ డబ్బులను తిరిగి రెండ్రోజుల తర్వాత ఇచ్చేసింది. అయితే ఉన్నట్టుండి రహాసుద్దీన్ తన ఇంటికి సమీపంలోకి వచ్చి అసభ్యపద జాలంతో దూషించాడని ఆ మహిళ తెలిపింది. దీంతో కోపాద్రిక్తులైన మహిళ తరుఫున వారు అతనిపై దాడికి దిగారు. అనంతరం రహాసుద్దీన్ కు చెందిన కొందరు వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడి ఎదురుదాడికి దిగారు. దీంతో ఘర్షణ మరింత ముదిరి.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారు అక్కడి నుంచి పరారయ్యారు.
Read Also: Elephant Death: పండు అనుకుని నాటుబాంబు కొరికిన గజరాజు.. నొప్పి భరించలేక..