ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. మొదట తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీంతో ప్రియురాలు నిరాకరించడంతో యువకుడు సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి పెట్రోల్ తీసుకుని మళ్లీ ప్రియురాలి దగ్గరకు వచ్చాడు. మళ్లీ చివరగా పెళ్లి చేసుకోవాలని అని అడగగా.. అప్పుడు కూడా నిరాకరించడంతో యువకుడు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వచ్చి మేకల దొంగతనానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.
37 ఏళ్ల సనా మీర్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్తాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలామంది క్రికెట్ అభిమానులు ఆమే క్యూట్ లుక్స్ కు పడిపోయారు. తాను చూసేందుకు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నలా ఉండటంతో.. ఇప్పుడు రష్మిక ఫ్యాన్స్ అంతా తనను కూడా లైక్ చేస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వర్షాల కారణంగా 19 మంది చనిపోయారు. అటు ఉత్తరాఖండ్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
ఆసియా కప్ 2023లో భాగంగా.. టీమిండియా బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ 100 బంతుల్లో ఎదుర్కొని సెంచరీ చేయగా.. కోహ్లీ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు. ముంబై-గౌహతి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనుకున్న సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్న 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది. నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన టీమిండియా.. ఇవాళ కూడా దూకుడుగా ఆటను ప్రారంభించారు.