Indigo Flight: ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు. ముంబై-గౌహతి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గౌహతి విమానాశ్రయానికి చేరుకోగానే నిందితుడిని గౌహతి పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్ సోమవారం తెలిపింది.
Read Also: Bussiness Idea : అదిరిపోయే బిజినెస్ ఐడియా.. నెలకు రూ.40 వేలు సంపాదన..
ముంబై-గౌహతి మధ్య ఇండిగో ఫ్లైట్ 6E-5319లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలి నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలపై ఫిర్యాదు అందడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. “ఫిర్యాదుదారు స్థానిక పోలీసులకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అవసరమైన చోట దర్యాప్తులో ఎయిర్‌లైన్ సహాయం అందిస్తుంది” అని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సంఘటన గురించి ఇండిగో ఎటువంటి తదుపరి సమాచారాన్ని తెలపలేదు.
Read Also: Mamata Banerjee: చంద్రబాబు అరెస్ట్పై మమతా బెనర్జీ ఏమన్నారంటే..!
బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లైట్ లైట్లు డిమ్‌గా ఉన్నాయని.. నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆర్మ్‌రెస్ట్ పైకి లేచి ఒక వ్యక్తి తనపైకి వంగి ఉన్నట్లు ఆమె పేర్కొంది. కొంతసేపటి తర్వాత చేయి తనపై వేశాడని.. కానీ కళ్లు తెరవకుండా అలానే పడుకున్నట్లు యాక్టింగ్ చేసినట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత ప్రయాణికుడు తనను అనుచితంగా తాకడం ప్రారంభించినట్లు మహిళ పేర్కొంది. దీంతో ఆ మహిళ సీటు లైట్‌ను ఆన్ చేసి క్యాబిన్ సిబ్బందికి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. క్యాబిన్ సిబ్బంది రాగానే నిందితుడు క్షమాపణ చెప్పాడని.. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌లైన్స్ నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు బాధిత మహిళ చెప్పింది.