ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆరోగ్యకారణాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జైన్‌కు మంజూరైన బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నార్ల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. అయితే ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.
ముంబైలోని నైగావ్ ప్రాంతంలో సినీ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఓ యువతి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తనను అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడని.. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియుడి చేతిలో ఆమె హత్యకు గురైంది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. నిన్నటిలానే పలుమార్లు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఇవాళ కూడా నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 47 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడుతుండటంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత సోమవారం మధ్యాహ్నం కాలేజ్ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విద్యార్థినిని మార్గమధ్యంలో వదిలి నిందితులు పరారయ్యారు.
ఆసియా కప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10 వేల పరుగుల మార్కును దాటాడు.
నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచి మంచి జోరు మీదున్న టీమిండియా.. శ్రీలంకతో ఆరంభంలో మంచి ప్రారంభాన్ని అందించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థసెంచరీ సాధించగా.. మరో ఓపెనర్ గిల్(19) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం (3) పరుగులు చేసి ఔటయ్యాడు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం కులు, మండిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులను పరామర్శించి వారితో కలిసి బాధలను పంచుకున్నారు.