Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్ పోసుకుని ప్రియుడు సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: బీహార్‌లోని గయాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. మొదట తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీంతో ప్రియురాలు నిరాకరించడంతో యువకుడు సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి పెట్రోల్ తీసుకుని మళ్లీ ప్రియురాలి దగ్గరకు వచ్చాడు. మళ్లీ చివరగా పెళ్లి చేసుకోవాలని అని అడగగా.. అప్పుడు కూడా నిరాకరించడంతో యువకుడు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటర గయా జిల్లాలోని డెల్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాజ్ బిఘా గ్రామంలో జరిగింది.
Read Also: SBI : రూ. 5 వేలతో, రూ.50 లక్షలు లాభం.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు..
Also Read
తీవ్ర గాయాలైన యువకుడు అక్కడే నేలపై కొట్టుకుంటూ ఉన్నాడు. యువకుడిని గమనించిన స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని అమన్(24)గా గుర్తించారు. మంటలతో అమన్ శరీరం 60 శాతం కాలిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీరియస్ సిట్యుయేషన్స్ లో కూడా తన ప్రియురాలి పేరునే కలవరిస్తున్నాడు. ఒక్కసారి తనతో మాట్లాడాలని అంటున్నాడు. ఆ అమ్మాయితో అమన్ గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. యువకుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మాట్లాడుతూ.. కాలిన శరీరంతో స్థానికులతో పాటు పోలీసులు ఆస్పత్రిలో చేర్చారని.. అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు. యువకుడిని హైలీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచామని.. నిపుణులైన వైద్యులు యువకుడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Read Also:RGV: ఏపీ ప్రజలపై ఆర్జీవీ ఫైర్.. వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ..
మరోవైపు యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో.. అమ్మమ్మతాతయ్యల దగ్గరు ఉంటుంది. అమ్మాయి తాత ఘజండి స్టేషన్‌లో పనిచేస్తాడు. యువకుడు అమన్ తల్లితండ్రులు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. వారిద్దరి మధ్య 2018 నుంచి ప్రేమాయణం సాగుతోంది. యువతి ఓ NGOలో పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు