Sana Mir: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సనా మీర్ గురించి తెలియని వారుండరు. ఆమే పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున 14 సంవత్సరాల పాటు ఆడి అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్ గా, అసాధారణ ఆట తీరును ప్రదర్శించింది. సనామీర్ 226 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడగా.. 137 మ్యాచ్ లలో జట్టు కెప్టెన్ గా వ్యవహరించింది. మరోవైపు వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ బౌలర్ గా రికార్డులకెక్కింది.
Read Also: Taneti Vanitha: చంద్రబాబును అయ్యో పాపం అనేవాడే లేడు.. బంద్ విఫలమే నిదర్శనం..
2018లో ఐసీసీ వన్డే బౌలర్ ర్యాక్సింగ్ లో నెం.1 ర్యాంకు సాధించిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్ గా సనా మీర్ నిలిచింది. 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్ కు రెండు బంగారు పతకాలను సాధించిపెట్టింది సనా మీర్. 240 అంతర్జాతీయ వికెట్లను తీయగా.. 2009 నుంచి 2017 వరకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా సారథ్యం వహించింది. ఈమే అంతర్జాతీయ క్రికెట్ కు 2020 మేలో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా చేస్తున్నారు.
Read Also: Heavy Rains: యూపీలో వర్ష బీభత్సంతో 19 మంది మృతి.. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక
అయితే 37 ఏళ్ల సనా మీర్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్తాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలామంది క్రికెట్ అభిమానులు ఆమే క్యూట్ లుక్స్ కు పడిపోయారు. తాను చూసేందుకు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నలా ఉండటంతో.. ఇప్పుడు రష్మిక ఫ్యాన్స్ అంతా తనను కూడా లైక్ చేస్తున్నారు. రష్మిక సిస్టర్ ఏంటీ పాకిస్తాన్ జట్టులో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.