ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బాలికను వేధించాడనే ఆరోపణతో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ బర్హాన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఒంటిపై దుస్తులు తొలగించి స్తంభానికి కట్టేసి కొట్టారు.
ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో, రోజువారీ పనుల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న సమస్య వెన్ను నొప్పి.
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చదువు కోసం స్కిల్ పేరుతో రూ.356 కోట్లు నిధులు మంజూరైతే.. చంద్రబాబు కొన్ని సెల్ కంపెనీ పేరుతో దోచుకున్నాడని దుయ్యబట్టారు.
ఆయేషా హత్య కేసులో ఆయేషా తల్లిదండ్రులను విచారించేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో వారిని కలిసిన అధికారులు.. మరొకసారి డిటైల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు పర్యటించారు. (సెప్టెంబర్ 15 - 28) మధ్య పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులు వెళ్లగా.. అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.
2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ 8వ సారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.