నారా బ్రాహ్మణి పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా కప్ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతితో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన రెండో ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడంతో వన్డే క్రికెట్‌లో 50 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు.
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ ఓడిన భారత్.. బౌలింగ్ కు దిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్లనే శ్రీలంక మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
ఢిల్లీలో జరిగిన విస్తృత స్థాయి "కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ" (సీడబ్ల్యూసీ) సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీలో అమలు కాని 10 కేంద్ర ప్రభుత్వ హామీలను గురించి తెలిపారు.
సనాతన్ ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సంబంధించి 'భారత్' కూటమిని బీజేపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఓ ప్రకటన చేశారు. డీఎంకే మంత్రి చేసిన ప్రకటన చాలా దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ప్రపంచంలోని ఏ శక్తీ దానిని నాశనం చేయదని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రాణాలను రక్షించింది అక్కడి ప్రభుత్వం.
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్‌కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు.. ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపించాడు.