ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
నిన్న భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనపై భారతమాత ఫౌండేషన్ స్పందించింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భాగ్యనగరంలో భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో ఓఆర్‌ఆర్ కల్వర్టు కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో పోలీసులు మహిళను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కి చెందిన శివ నందగా పోలీసులు గుర్తు పట్టారు.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ నోటీసు ఇచ్చింది. బస్ భవన్‌లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు.
హన్మకొండ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం మండలం గూడురు శివారులో ఆర్టీసీ బస్సు- టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌లో వెళ్తున్న 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. అందులో డ్రైవర్తో సహా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
గాంధీ భవన్‌లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.