నిన్న భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనపై భారతమాత ఫౌండేషన్ స్పందించింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భాగ్యనగరంలో భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, యువతలో దేశభక్తిని రేకెత్తించే ఈ కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ ఒక ఆనవాయితీగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ మహా హారతి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని భారతమాత ఫౌండేషన్ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతను అప్పజెప్పిందని భారతమాత ఫౌండేషన్ తెలిపింది.
Chandrababu: ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
రాజమహేంద్రవరంకు చెందిన SG క్రాకర్స్ అనే సంస్థ భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం, భారతదేశం మ్యాప్, జాతీయ త్రివర్ణ పతాకాన్ని క్రాకర్ షో ద్వారా ఆవిష్కరిస్తామని ప్రతిపాదించింది.. ఈ సంస్థకు క్రాకర్ షో నిర్వహణలో 100 సంవత్సరాల అనుభవం ఉందని భారతమాత ఫౌండేషన్ పేర్కొంది. ఇటీవల జనవరి 24న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలోనూ క్రాకర్ షోను విజయవంతంగా నిర్వహించింది.. 100 ఏళ్ల పురాతన ఈ సంస్థకు క్రాకర్ షో నిర్వహణలో ఉన్న ఘనమైన రికార్డును పరిగణనలోకి తీసుకొని క్రాకర్ షో ప్రతిపాదనలకు భారతమాత ఫౌండేషన్ ఆమోదం తెలిపింది.
Olive Ridley turtles: చెన్నై తీరంలో వేల సంఖ్యలో ‘‘ఆలివ్ రిడ్లే తాబేళ్ల’’ మృతి..
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది భారతమాత మహా హారతి కార్యక్రమం ప్రజల కరతాళ ధ్వనుల మధ్య విజయవంతంగా పూర్తయ్యాయి.. అయితే కార్యక్రమం చివర్లో నిర్వహించే క్రాకర్ షోలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని భారతమాత ఫౌండేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు, ఒకరికి తీవ్ర గాయాల పాలవడాన్ని చింతిస్తున్నామని పేర్కొంది. గాయపడిన వారందరికీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం.. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భారతమాత ఫౌండేషన్ అండగా ఉంటుందని వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నామని భారతమాత ఫౌండేషన్ తెలిపింది.