తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మీర్ పేట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసుల నిర్ధారించారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు గురుమూర్తి.. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి. గురుమూర్తి చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ తిన్నారు.
Read Also: Saif Ali Khan Case: సైఫ్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్
కాగా.. సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజులు సెలవులు రావడంతో ఈ హత్య చేసి మృతదేహాన్ని ఎలా బయటపడేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందు 14వ తేదీన భార్య, పిల్లలతో సినిమాకి వెళ్ళాడు.. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి భార్య భర్త ఇంటికి వచ్చారు. ఆ తర్వాత.. భార్య మాధవి గురుమూర్తితో గొడవ పడింది.. ఈ క్రమంలో తాళి తీసి గురుమూర్తి మొహంపై విసిరింది. దీంతో.. తీవ్ర కోపాద్రిక్తుడైన గురుమూర్తి మాధవిని గోడకు అదిమి పట్టాడు. అయితే.. మాధవి స్పృహ తప్పి పడిందనుకున్నట్లు గురుమూర్తి అనుకోగా.. వెళ్లి చూసే సరికి చనిపోయి ఉంది. దీంతో.. శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు నిందితుడు గురుమూర్తి.. ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోశాడు. ఆ తర్వాత వాటర్ హీటర్‌ను ఆన్ చేసి బకెట్‌లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు.. అనంతరం బోన్స్‌ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చి.. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకెట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేశాడు గురుమూర్తి.
Read Also: Medchal Murder Case: మేడ్చల్ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..