Beerla Ilaiah: రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడు.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు
- కేటీఆర్ పై బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు
- కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించిండు- బీర్ల ఐలయ్య
- నల్లగొండలో రైతు ధర్నా అట్టర్ ప్లాప్- బీర్ల ఐలయ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు. నల్లగొండలో రైతు ధర్నా అట్టర్ ప్లాప్ అయింది.. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ధర్నాకు మద్దతు తెలుపలేదని బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండను తీర్చి దిద్దుతున్నారు.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఈ- ఫార్ములా కార్ రేసులో అడ్డంగా దొరికి పోయిన దొంగ కేటీఆర్.. దొంగే దొంగ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీర్ల ఐలయ్య అన్నారు.
Read Also: Canada: ట్రంప్ దారిలోనే కెనడా.. అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తానన్న పీఎం అభ్యర్థి..
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్‌డ్రా..!
కేటీఆర్ రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నాడు.. వ్యక్తి గత ఇమేజ్ కోసం రైతులను వాడుకోవాలని చూస్తున్నాడని బీర్ల ఐలయ్య తెలిపారు. ఎస్ఎల్బీసీ, డిండి, ఉదయసముద్రం ప్రాజెక్టును పట్టించుకోకుండా నల్లగొండ జిల్లా ప్రజలను మోసం చేశాడని కేటీఆర్ పై మండిపడ్డారు. ఈ నెల 26,529 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి.. కేవలం నల్లగొండలో 100 కోట్లు రైతుల ఖాతాలో టిక్ టిక్ మని డబ్బులు పడితే కేటిఆర్ చెవులు దొబ్బాయా? అని దుయ్యబట్టారు.
Read Also: Meerpet Murder Case: పక్కా ప్రణాళిక ప్రకారం హత్య.. సీపీ సంచలన విషయాలు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పాటు రైతు కూలీలను ఆదుకుంటుందని బీర్ల ఐలయ్య తెలిపారు. పది ఏండ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసింది మీరు కాదా..? అని కేటీఆర్ ను దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్‌కు, బీఆర్ఎస్ కు తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ది చెప్తారన్నారు. నల్లగొండ నుండే కేటీఆర్ పతనం స్టార్ట్ అయిందని ఆరోపించారు. మరోవైపు.. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అవార్డులు ఇచ్చే ధోరణిలో ఉంది.. కేవలం గద్దర్ వాళ్ళ పార్టీ కార్యకర్త మీద పాట పాడిండని బండి సంజయ్ మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య పేర్కొ్న్నారు.
- Tags
- Beerla Ilaiah
- BRS
- congress
- ktr
- Nalgonda
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?