Sridhar Babu: ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం..
- విదేశీ పర్యటనలో రూ.లక్షా 79 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం- శ్రీధర్ బాబు
- వాణిజ్యం, వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
- ప్రజలకు ఉపయోగపడేలా విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం- శ్రీధర్ బాబు
- తెలంగాణ, హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ ఉంది- శ్రీధర్ బాబు
- పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకున్నాం- శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వివరాలను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం కావాలని వ్యాపార సంస్థలు కోరుకుంటాయి.. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంపై 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక మెరుగైన వాణిజ్యం, వ్యాపారం స్టేట్‌గా ఎదగాలని ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు.. అంటే 1లక్షా 79 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Read Also: Sam Pitroda: ‘‘అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్‌లోకి రానివ్వండి’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడి వ్యాఖ్యలు..
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
పాలసీ విధానాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు తీసుకు వచ్చాం.. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని సద్విమర్శలుగా తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకున్నాం.. సింగపూర్‌కు చెందిన ఇద్దరు మంత్రులను కలిశాం.. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల నైపుణ్యం పెంచే అంశాల పై ముఖ్యమంత్రి సింగపూర్ మంత్రులతో చర్చించారని అన్నారు. సింగపూర్ మంత్రులు కూడా తమ సహకారం అందిస్తామన్నారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సింగపూర్ రివర్ చిన్నదే కానీ… నదిని ప్రక్షాళన చేస్తే అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిసిందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tata Nexon CNG Dark Edition: టాటా కొత్త సీఎన్‌జీ కారు విడుదల.. రేటు, రేంజ్ ఎంతంటే?
ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసామని అన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఐటీఈఎస్ వారితో ఎంవోయూ చేసుకున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి యంగ్ ఇండియా యూనివర్సిటీ టీచర్లకు కరికులం విషయంలో ట్రైనింగ్ ఇస్తారని పేర్కొన్నారు. మరోవైపు.. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అంశాలు చర్చించామని చెప్పారు. తమకు సింగపూర్ సంస్థలతో చేసిన చర్చలు గొప్ప సంతృప్తి కలిగిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!