Harish Rao: ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావత్..
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఎటాక్
- రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా..?- హరీష్ రావు
- మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదు
- ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావత్- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ పర్యటన వివరాల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.1.80 వేల కోట్లు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చినందుకు ఆయా కంపెనీలకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు. రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా అని ప్రశ్నించారు. రైతు భరోసా చిల్లర పంచాయతీనా ముఖ్యమంత్రి గారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Health Tips: వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలా? ఈ చిట్కాలు మీకోసమే..
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని విమర్శించారు హరీష్ రావు. మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావని ఆరోపించారు. ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావత్ అంటూ దుయ్యబట్టారు. దావోస్‌లో జరిగే ఎంఓయూలు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందే అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అంటే.. మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారు.. భట్టి విక్రమార్క చెప్పింది నిజమా..? మీ మాటలు నిజమా? రేవంత్ రెడ్డి.. అంటూ ప్రశ్నించారు.
Read Also: Beerla Ilaiah: రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడు.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు
పొంతన లేకుండా మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది.. అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందని అన్నారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా..? అంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నావు.. ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నావు.. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది.. చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచావని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నావు.. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టి మీ ప్రచారం వినాలా? అంటూ దుయ్యబట్టారు. రైతుల అప్పులు ముఖ్యమా.? దావోస్ డప్పులు ముఖ్యమా..? అంటూ విమర్శించారు. మీ సెల్ఫ్ డబ్బాకు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది.. ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది.. నీ మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది.. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!