CPM: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ..
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జాన్ వెస్లీ
- మొదటిసారి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దళిత నేత
- మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన జాన్ వెస్లీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నారు. సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహా సభల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం జాన్ వెస్లీ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 70 ఏళ్లు దాటిన నేతలకు సీపీఎం రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన కల్పించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, నర్సింగరావు కమిటికి దూరమయ్యారు.
Read Also: Thandel: ‘తండేల్’లో చైతన్యది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్: అల్లు అరవింద్
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
కాగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి సీపీఎం పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం రిలీవ్ అయ్యారు. దాదాపు మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈనెల 25న బహిరంగ ప్రదర్శనతో మహాసభలు ప్రారంభం కాగా… ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు పాల్గొన్నారు. మరోవైపు.. సీపీఐఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికవుతారని అనుకున్నారు. ఆయనతో పాటు సీఐటీయూ నేత ఎస్. వీరయ్యకు పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరికీ కాకుండా.. జాన్‌వెస్లీకి బాధ్యతలు ఇచ్చారు.
Read Also: Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!