ICC Womens U-19: చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ.. మంత్రి అభినందనలు
- అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్ చరిత్రలో మొదటి సెంచరీ
- చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష
- ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి, చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. త్రిష సాధించిన సెంచరీ.. క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. పిల్లల్లో ఉన్న క్రీడాసక్తిని, కల్చరల్ స్కిల్స్‌ను గుర్తించి.. వారు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరిసేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, గురువులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు.. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటినీ నెలకొల్పుతున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
Read Also: Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?
Also Read
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈరోజు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది. త్రిష టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష.. 53 బంతుల్లో సెంచరీ సాధించింది. మొత్తం 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది.
Read Also: Hanmakonda Crime: ఏకాంతంగా ప్రేమికులు.. తండ్రి ఎంత పనిచేశాడంటే.?
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!