ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు.
వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ సమస్య ఏర్పడుతుంది. మారిన వాతావరణం, చల్లటి గాలి వలన ముక్కు దిబ్బడ పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. పుప్పొడి, దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాల పదార్థాలు కూడా ముక్కు దిబ్బడకు కారణమవుతాయి.
సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలు అని విమర్శించారు.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చూపిస్తోంది. నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్ జట్టు ఓడిపోయింది. ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా వంటి జట్ల చేతిలో కూడా పాక్ జట్టు ఓడిపోయింది. పాకిస్థాన్ ఛానెల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓటమిపై చర్చిస్తూ.. బాబర్ అజామ్ కెప్టెన్సీలో ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన జట్టులోని ఆటగాళ్లందరిపై వసీం అక్రమ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రశ్నలను లేవనెత్తాడు. గత 2 సంవత్సరాలలో పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్ష జరగలేదని.. తాము 3…
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈ రోజు 23వ మ్యాచ్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ ఆఫ్ఘాన్ ఆలౌరౌండ్ ప్రదర్శన చూపించింది. దీంతో సూపర్ విక్టరీని అందుకుంది. ఇదిలా ఉంటే.. తమ జట్టు ఓటమిపై కెప్టెన్ బాబర్ ఆజం స్పందించారు.
విజయదశమి సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్ర పూజలు చేశారు. అనంతరం సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ చేరుకోవడానికి ముందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ లో సైనికులతో ముచ్చటించారు. అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేస్తారనే భావనను ప్రశంసించారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే రూ. 750కి ఎల్‌పిజి సిలిండర్, నెలకు రూ. 2 వేలు పెన్షన్, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని హమీలు ఇచ్చారు.
అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు, పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలని సూచించారు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు.