ఇవాళ్టి సమావేశం హిస్టారికల్ మీటింగ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు.
ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. వెర్సోవా ప్రాంతంలోని ఓ స్పా సెంటర్ పై ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్ రైడ్ చేశారు. అందులో 9 మంది బాలికలను రక్షించారు. వెర్సోవాలోని చార్ బంగ్లా ప్రాంతంలోని రివైవల్ వెల్ నెస్ స్పాలో మసాజ్ పార్లర్ పేరుతో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశారు.
బంగ్లాదేశ్ రాజధాని సమీపంలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలయ్యాయి. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశ పురోగతికి బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారత్ కూటమిని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నేడు దేశం మూడు సమస్యలను ఎదుర్కొంటోందని కేజ్రీవాల్ అన్నారు. అందులో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి ఉన్నాయని తెలిపారు.
కాళేశ్వరం గొప్ప గురించి కేసీఆర్ చెప్పారని.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా దెబ్బ తిన్నదో తెలుస్తోందని పొంగులేటి విమర్శించారు. దీనికి కారకులు ఎవరూ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఏటీఎంగా కేసీఆర్ కు ఉపయోగపడిందని అన్నారు. కాళేశ్వరం పై మొదటి నుంచి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజం అయ్యాయని.. సీవీసీ చేత విచారణ జరపాలని కోరారు.
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తన పేరును తొలగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్‌సింగ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(77) కన్నుమూశారు. బిషన్ సింగ్ బేడీ టీమిండియాలో గొప్ప స్పిన్నర్. అతను 1946 25 సెప్టెంబర్ న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్ ల్లో విన్నర్‌గా నిరూపించుకున్నాడు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.