వేప ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు అందరికి తెలిసిందే. అయితే వేప కాయలు తిన్న కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. వేప కాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది.
వింటర్ సీజన్ వచ్చేసరికి ఆహారంలో మార్పులు జరుగుతాయి. చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారాన్ని తినాలి. ఇలాంటి పరిస్థితిల్లో శెనగ సత్తు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఎంతో మేలు చేసే సత్తులో ఇలాంటి గుణాలు చాలా ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2023 ఇండియాలో జరుగుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. ప్రతీ మ్యాచ్ ను క్రికెట్ స్టేడియంకు వెళ్లి ఆతిథ్య జట్టుకే కాకుండా.. ఇతర జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఇక స్టేడియంకు వెళ్లని వారైతే టీవీల్లో కానీ, ఫోన్లలో కానీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అత్యధిక వ్యూయర్ షిప్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ రేటింగ్ పెరిగింది.
ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. చివర్లో జిమ్మీ నీషమ్ (58) దూకుడుగా ఆడినప్పటికీ చివరి ఓవరల్ రనౌట్ రూపంలో వెనుతిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 383/9 పరుగులు చేసింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్- నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందు నెదర్లాండ్స్ స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో నెదర్లాండ్ 229 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా టాస్ గెలిచిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68) పరుగులతో రాణించాడు.
2023 వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఇక తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తో తలపడనుంది. రేపు(ఆదివారం) లక్నోలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రేపటి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. లక్నోలో స్పిన్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది కావున.. అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కింగ్ కోహ్లీ 35వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. కింగ్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయనున్నారు. అదే రోజు భారత్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ కూడా ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా.. కోహ్లీ పుట్టినరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
డేవిడ్ వార్నర్ లైవ్ మ్యాచ్‌లో పుష్ప పాటకు స్టెప్పులేశాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పుష్ప స్టెప్పులు వేసి అభిమానులను సంతోషపరిచాడు. వార్నర్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ప్రపంచకప్ 2023లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనిపిస్తున్నాడు. టోర్నీలో ఓ సెంచరీ నమోదు చేయగా.. మిగిలిన మ్యాచ్ ల్లోనూ దూకుడుగా ఆడి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తర్వాత జరిగే ఇంగ్లండ్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అయితే ఒకటి, రెండు కాదు.. మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనున్నాడు.
ప్రపంచకప్ 2023లో ఆసీస్ జట్టు తొలి మ్యాచ్ టీమిండియాపై, ఆ తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ వరుసగా విజయం సాధించింది. బ్యాటింగ్లో రాణించడం వల్లే ఆసీస్ జట్టు గెలుపొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ 350కి పైగా పరుగులు చేసింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే ఆసీస్ జట్టు అరుదైన రికార్డ్ ను సాధిచింది.