Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్‌కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
- దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు రానున్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్.
- జరిగే ఛాందసవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.
- 2007లో నిరసనల నేపథ్యంలో కోల్‌కతాను విడిచి వెళ్లిన తస్లీమా.
- పర్యటనను స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన రచయిత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taslima Nasrin: ప్రవాసంలో ఉంటున్న వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ 20 ఏళ్ల తర్వాత కోల్‌కతా రాబోతున్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె బెంగాల్ గడ్డపై అడుగుపెడుతున్నారు. తస్లీమా ఆగస్టు 1వ తేదీన రవీంద్ర సదన్‌లో జరిగే ఛాందసవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొంటున్నారు. ఈ శుభవార్తను తస్లీమా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. లెఫ్ట్ ప్రభుత్వాలు బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో 2007లో తస్లీమా కోల్‌కతా విడిచి వెళ్లారు. అప్పటి నుంచి పలు సందర్బాల్లో నగరంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా కారణాలు చూపుతూ అనేక కార్యక్రమాలను రద్దు చేశారు.
తస్లీమా నస్రీన్ రాసిన ‘‘లజ్జ’’ పుస్తకం బంగ్లాదేశ్‌లో తీవ్ర వివాదస్పదమైంది. ఇస్లాంలోని దురాగతాలను ఆమె ఈ పుస్తకంలో ప్రస్తావించారు. దీంతో బంగ్లాలో మతోన్మాదులు ఆమెపై ఫత్వా జారీ చేసి, చంపేస్తామని బెదిరించారు. అజ్ఞాతంలో ఉన్న తర్వాత, ఆమె 1994 చివరలో స్వీడన్‌కు పారిపోయి ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఆమె రాసిన అనేక పుస్తకాలు బంగ్లాదేశ్‌లో నిషేధానికి గురయ్యాయి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తస్లీమా తన కోల్‌కతా రాక గురించి సోషల్ మీడియాలో స్పందించారు. ఉస్మాన్ మాలిక్ చేసిన ఒక పోస్టునున ఆమె షేర్ చేస్తూ.. దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతా తిరిగి వస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు. ఆమె పర్యటనపై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. కోల్‌కతాతో తస్లీమాకు ప్రత్యేక భావోద్వేగ సంబంధం ఉంది. తన రచనల్లో ఈ నగరం కీలక పాత్ర పోషించిందని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. తనకు అత్యంత ఇష్టమైన నగరం కోల్‌కతా అని చాలా సార్లు చెప్పారు. సెక్యులర్ మిషన్, హెచ్ఆర్బిఎఫ్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమానికి ఆమె వస్తు్న్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!