తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ మొత్తం అభ్యర్థులను ప్రకటించగా.., తాజాగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల అయింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి జాబితాలో 55 మందికి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే తర్వాత వచ్చే జాబితాలో తమ పేర్ల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
Read Also: Minister Ambati Rambabu: టీడీపీ – జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు..
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు, పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలని సూచించారు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని.. టికెట్ల కేటాయింపుల విషయంలో ఏ నాయకులు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, నాయకులకు వ్యతిరేకంగా కానీ బహిరంగంగా మాట్లాడవద్దని అన్నారు.
Read Also: Hyderabad: ఓ వివాహితపై ఇద్దరు మహిళల అఘాయిత్యం
పత్రిక సమావేశాలు, ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, పార్టీ నాయకుల మీద బహిరంగంగా మాట్లాడవద్దని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో కొందరు నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడుతున్నారు.. ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. అలా చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకం అలా చేయకూడదని అన్నారు. ఏ నాయకులు కూడ బహిరంగంగా మాట్లాడవద్దని.. ఎలాంటి సమస్యలున్నా పార్టీ దృష్టికి తీసుకురావాలని మన్సూర్ అలీఖాన్ సూచించారు.