వన్డే ప్రపంచకప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ బరిలోకి దిగారు. అయితే లంక బౌలర్లలో మధుషంక వేసిన తొలి ఓవర్లనే కెప్టెన్ రోహిత్ శర్మ(4) ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, గిల్ కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Read Also: Virat Kohli: కోహ్లీ మరో అరుదైన రికార్డ్.. సచిన్ను దాటేసిన రన్ మిషన్
వీరిద్దరూ క్రీజులో ఆడుతున్నంత సేపు భారత్ స్కోరు భారీగా వెళ్తుందని అందరు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మధుషంక బౌలింగ్ లో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే ఓవర్లలో కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. దీంతో అభిమానులందరూ తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇద్దరు బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
Read Also: Gajendra Shekhawat: ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..
ఇదిలా ఉంటే.. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సెంచరీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్క సెంచరీ చేస్తే, సచిన్ రికార్డును సమం చేసిన వాడవుతాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 95 పరుగులు చేసి ఔట్ కావడంతో కోహ్లీతో పాటు అభిమానులు కూడా తీవ్రంగా బాధపడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా సెంచరీ కొట్టి తీరుతానన్న ధీమాతో ఉన్న కింగ్ కోహ్లీకి మరోసారి పరాభవం ఎదురైంది. సెంచరీ దగ్గరకు వచ్చి మిస్ కావడంతో తీవ్ర నిరాశతో ఉన్నాడు. వరల్డ్ కప్లో ఇలా సెంచరీ మిస్ కావడం కోహ్లీకి రెండోసారి. చూడాలి మరీ తర్వాతి మ్యాచ్లోనైనా సెంచరీ చేయగలుగతాడో లేదో..