దేశ ద్రోహం కేసు, తెల్గి స్కాంలో మూడేళ్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో పత్రాలను చూపించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
Read Also: Rahul Gandhi: “పనౌటీ” వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు..
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. తాను ప్రచారం చేసిన బస్తీలలో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హారతులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి రోహిత్ రెడ్డి తనపై నాలుగు కేసులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొనడం జరిగిందని, అందులో మూడు కేసులు ఉన్నాయని చెప్పారు. మరి అంబర్పేటలో భూకబ్జాలు చేద్దామని ఇక్కడకు వచ్చాడా అని ప్రశ్నించారు. అంబర్ పేట ప్రజలు డిపాజిట్ కూడా లేకుండా చేస్తారని అన్నారు.
Read Also: Jagadeeshwar Goud: మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం