సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో నాకు చివరి సభ…
తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పోరాటం, నీళ్లు - నిధులు - నియామకాల కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌తో కళ్ల మంటలు.. ఇవి సరిపోవడం లేదని 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థుల బలిదానం, మలిదశ ఉద్యమంలో మనకళ్లముందే 1200 మంది ఆత్మబలిదానం, చిన్న నుంచి పెద్ద వరకు, సకల జనులంతా ఏకమై.. గొర్లు, బర్లు కాసే వాళ్ల దగ్గరన్నుంచి…
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సందేశం ఇచ్చారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా.. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారని వీడియో సందేశంలో తెలిపారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నాని అన్నారు.
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం.. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా ముగిసింది. 14 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణలో మునిగిపోయారు. అంతేకాకుండా.. ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలతో అనుదినం వివిధ ప్రత్యేకతలతో భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు మరో వ్యాధి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి కూడా చైనా నుంచే పుట్టింది. చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న లియోనింగ్ ప్రావిన్స్‌లోని పిల్లల్లో న్యుమోనియా ముప్పు అధికమవుతుంది. పిల్లలలో ఊపిరితిత్తులలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లక్షణాలు కనిపిస్తూ.. వేగంగా పెరుగుతుంది. అయితే.. చైనాలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియాపై ఎయిమ్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు.
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హరిహరగంజ్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. ఔరంగాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మళ్లీ అక్కడి నుండి గయాలోని మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ... నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క... రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందని ఎమోషనల్ కామెంట్స్…