తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. బిలారీ రోడ్‌వేస్ బస్టాండ్‌లో ఉన్న చేతి పంపు నుంచి తెల్లటి పాల లాంటి నీరు బయటకు వచ్చాయి. దీంతో అక్కడి జనాలు అది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానిని తీసుకెళ్లడానికి జనాలు ఎగబడ్డారు. ఇళ్ల నుంచి బకెట్లు, ప్లాస్టిక్ సంచులు తెచ్చుకుని ఆ పదార్థాన్ని తీసుకుపోయేందుకు పెద్ద సంఖ్యలో గూమికూడారు.
నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్వహించబడుతుందని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. 9 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు.. కేవలం ప్రకటించడమే మాత్రమే కాదు తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వర్గీకరణ జరుగుతుందని ఎదురు చూసామని తెలిపారు.
ఆదిలాబాద్ లో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటినుండి నేను తెలంగాణాలో పర్యటిస్తున్నాను.. ఇక్కడ కాంగ్రెస్ అనుకూల వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. అబద్దాలతో రెండుమార్లు అధికారంలోకొచ్చారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్ళ తెలంగాణాలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని పేర్కొన్నారు.…
ప్రచారానికి రేపు ఒక్కరోజు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అందులో భాగంగా.. ఖమ్మం జిల్లా ముష్టికుంట్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు తెలంగాణ పేదలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏం చేయలేని కేసీఆర్ ఎక్కడుంటే ఏం లాభమని ప్రశ్నించారు?.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. మీ అమ్మగారైన శ్రీమతి సోనియాగాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండి కూడా.. దాదాపు 1200మంది ఆత్మహత్య చేసుకున్నాక గానీ.. తెలంగాణ ఇవ్వలేదు. ఇది కాకుండా.. నాడు విద్యార్థి లోకం, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తుంటే.. వారికి మద్దతు తెలపాల్సింది పోయి, రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, మజ్లిస్ పార్టీలతో మీరు జతకట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1969లో జరిగిన తొలిదశ…
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యా్న్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
ఎన్నికలకు మరో మూడు రోజులు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం దూకుడు పెంచారు. ఏకంగా హైకమాండ్ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా పర్యటన షెడ్యూల్ ను రూపొందించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు.