ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈనెల 3న (ఆదివారం) ఎన్నికల ఫలితాలు రానుండగా.. మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే మరుసటి రోజే ఈ సమావేశం నిర్వహిస్తుండటంతో భేటీపై ఆసక్తి నెలకొంది
తెలంగాణలో గురువారం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయించాయి.. అవి తమ దృష్టికి రాగానే ఈవీఎంలను మార్చినట్లు పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లోని అకౌంటబిలిటీ కోర్టు సోమవారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతేకాకుండా.. రిమాండ్‌ను పొడిగించాలని ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి ముహమ్మద్ బషీర్ రావల్పిండిలోని అడియాలా జైలులో అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసును విచారించినట్లు అక్కడి ఓ వార్తాపత్రిక తెలిపింది.
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా ఈరోజు(గురువారం) ఎంపిక చేశారు. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు ఈ టూర్ జరగనుంది. ఈ టూర్ లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో టీ20లు, వన్డే సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆడనున్నట్లు తెలిపింది.
వరల్డ్ కప్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయిన బెన్ స్టోక్స్.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాగా.. ఆసుపత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిల్చున్న ఫొటోను స్టోక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఆసుపత్రిలో చేరాను, డిశ్చార్జి అయ్యాను... శస్త్రచికిత్స జరిగింది... ఇక కోలుకోవడమే మిగిలుంది" అంటూ ట్వీట్ చేశాడు.
పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. అందుకు సంబంధించి పలువురు రాజకీయ పార్టీల నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు
ఈ ఎన్నికల్లో పోటీచేసిన అగ్రనేతల ఇలాఖాల్లో పోలింగ్ శాతం ఎలా ఉందంటే.. కేసీఆర్, రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 34.6 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో 42.54 శాతం పోలింగ్ నమోదైంది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్ లో 41.40 శాతం ఓటింగ్.. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్ లో 43.20 శాతం ఓటింగ్ నమోదైంది. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 40.67 శాతం ఓటింగ్.. బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్ లో 38.90 శాతం…
కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబరు 2న ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియాలోని ఏకా అరేనా గ్రౌండ్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ మ్యాచ్ లు 2024 ఫిబ్రవరి 21 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ప్లే ఆఫ్‌లకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే తెలపనున్నారు. మరోవైపు పో కబడ్డీ సీజన్ 10 కోసం తెలుగు టైటాన్స్ కొత్త జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇండియాపై ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం వరించింది.