వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్లో జరగనున్నాయి. అందుకు సంబంధించి.. ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు స్థానాన్ని దక్కించుకున్నాయి.
భారత్-ఆస్ట్రేలియా మధ్య గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కేవలం 6 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆసీస్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. 57 బంతుల్లో (123) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది... ఈ క్రమంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండోవర్ చేశామని సీపీ పేర్కొన్నారు. మరోవైపు.. 7 జోన్లలో 1600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా.. 2 లక్షలు వాహనాలు చెక్ చేశామని.. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
తమిళనాడులోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి కేరళ వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ధర్మపురి-సేలం జాతీయ రహదారిపై గెంగాళాపురం ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఆ బస్సు అందరూ చూస్తుండగానే.. మంటల్లో దగ్ధమైంది.
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో తన దుర్మార్గపు కార్యకలాపాల నుంచి పాకిస్తాన్ విరమించుకోవడం లేదు. అక్కడ నివసించే కాశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలకు పాల్పడే వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. పీఓకేలోని కాశ్మీరీ పండిట్ల ప్రధాన పుణ్యక్షేత్రమైన శారదా పీఠ్ ఆలయ గోడను పాకిస్తాన్ సైన్యం కూల్చివేసింది. అంతేకాకుండా.. ఆ స్థలంలో కాఫీ షాప్ నిర్మించారు.
ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఆ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలుపొందింది. కంగారులపై యువ ఆటగాళ్లు చెలరేగడంతో 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. చివరి రెండు టీ20 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థుల మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలో వైన్స్ షాపులు కూడా మూతపడనున్నాయి. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల…
నెలరోజులుగా హోరెత్తించిన ప్రచారం పలు నియోజకవర్గాల్లో ముగిసింది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా.. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగించారు. అందులో.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసినట్లుగా ఎన్నికల కమిషన్ తెలిపారు.