Koti Deepotsavam 2023: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం.. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా ముగిసింది. 14 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణలో మునిగిపోయారు. అంతేకాకుండా.. ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలతో అనుదినం వివిధ ప్రత్యేకతలతో భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. ఎన్టీఆర్ స్టేడియం దీపాలకాంతులతో మెరిసిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కోటి దీపోత్సవం కార్తిక మాసం ప్రత్యేకతను భక్త కోటికి చాటిచెప్పింది.
Rajamouli :అప్పుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా
ఇదిలా ఉంటే.. 14 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో.. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహించారు. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణ, అతిరథ మహారథులు అతిథులుగా వచ్చేశారు. మరోవైపు.. చివరి రోజు కోటిదీపోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తిక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చివరలో ప్రధాని తొలి కార్తిక దీపాన్ని వెలిగించారు. ఇల కైలాసాన ఆదిదేవుడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చారు.
Mahesh Babu: యానిమల్ ట్రైలర్ చూసి మెంటల్ ఎక్కిపోయింది.. అందుకే ఈవెంట్ కు వచ్చా
కోటిదీపోత్సవంలో చివరి రోజు విశేష కార్యక్రమాలు జరిగాయి.. కార్తిక సోమవారం సహిత పూర్ణిమ సందర్భంగా పున్నమి కాంతుల్లో శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం లభించింది. ఆ తర్వాత తిరుమలేశుని కల్యాణం కమనీయంగా జరిగింది. భద్రాద్రి రామచంద్రుని వైభవం.. స్వర్ణ లింగోద్భవ కాంతులు.. సప్తహారతుల వెలుగులు వంటివి భక్తులను మైమరింపజేశాయి. ముగింపు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులతో పాటు ప్రధాని మోదీ గోవింద నామస్మరణ చేశారు.