Money Earning: ఆవులు, గేదెలకు బదులు గాడిదల పెంపకం.. ప్రతినెలా రూ.3 లక్షల వరకు సంపాదన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది.
గుజరాత్‌లోని మనుంద్ అనే చిన్న గ్రామానికి చెందిన ధీరేన్ సోలంకి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూశాడు. కానీ.. ఉద్యోగం రాకపోవడంతో గాడిదల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 8 నెలల క్రితం తన గ్రామంలో రూ.22 లక్షలతో కొద్దిపాటి భూమిని తీసుకుని 20 గాడిదలతో గాడిదల పెంపకం ప్రారంభించాడు. అయితే.. గుజరాత్‌లో గాడిద పాలకు ప్రాముఖ్యత లేకపోవడంతో ధీరేన్‌కు 5 నెలలు ఎలాంటి ఆదాయం రాలేదు. అయితే.. దక్షిణ భారతదేశంలో గాడిద పాలకు అత్యధిక డిమాండ్ ఉందని తెలుసుకుని.. ధీరేన్ దక్షిణ భారతదేశంలోని కొన్ని కంపెనీలను సంప్రదించాడు. ఆ తర్వాత క్రమంగా.. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు పాల సరఫరా చేయడం మొదలు పెట్టాడు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Congress Meeting: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి.. నేతలతో సోనియా గాంధీ సమావేశం
కాస్మోటిక్స్ కంపెనీలలో గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. 1 లీటరు పాలను 5000 నుండి 7000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ పాలతో తయారు చేసిన పొడిని విదేశాల్లో రూ.లక్ష నుంచి 1.25 లక్షల వరకు విక్రయిస్తున్నారు. గాడిద పాలల్లో ప్రోటీన్, హైపోఅలెర్జెనిక్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఆవు పాలతో పోల్చినట్లయితే, గాడిద పాలలో 9 రెట్లు ఎక్కువ టౌరిన్ ఉంటుంది. ఇది శిశువులలో పెరుగుదలను పెంచేందుకు తోడ్పడుతుంది. 19వ శతాబ్దంలో గాడిద పాలు పసిపిల్లలకు, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు తాగించే వారు. కాగా.. యూరప్, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో గాడిద పాలకు మంచి గుర్తింపు ఉంది. వీటిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇవి.. ఆర్థరైటిస్, దగ్గు, శస్త్రచికిత్స గాయాలు, అల్సర్ మొదలైనవాటిని నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్రాన్స్, ఇటలీలలో.. గాడిద పాలతో సబ్బును కూడా తయారు చేస్తారు.
కాగా.. ఇప్పుడు ధీరేన్ వద్ద 42 గాడిదలు ఉన్నాయి. వాటికి దాదాపు రూ.38 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సగటున.. ఒక గాడిద 800 ml పాలు ఇస్తుంది. ధీరేన్ తన వ్యాపారాన్ని వెబ్‌సైట్ ద్వారా కూడా చేస్తున్నాడు. దీంతో అతను ప్రతి నెలా రూ.2 నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?