నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్‌లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఫలితాలు ప్రకటించిన 24 గంటల తర్వాత.. బాల్ముకుంద్ ప్రభుత్వ అధికారిని పిలిచి, సాయంత్రంలోగా అన్ని నాన్-వెజ్ ఫుడ్ స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు. వీధులు శుభ్రంగా ఉండాలని తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఓ ప్రభుత్వ అధికారికి ఆదేశాలు జారీ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలతో మమేకమయ్యేందుకు బల్ముకుంద్ బయల్దేరాడు. ఈ క్రమంలో.. రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఓ అధికారిని పిలిచి నాన్‌వెజ్‌ను బహిరంగంగా అమ్మవచ్చా అని అడిగాడు. అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వండి. మీరు దానిని సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. రోడ్డుపై బహిరంగంగా నాన్‌వెజ్ విక్రయాలు సాగించే వారు కనిపించడం లేదన్నారు. సాయంత్రంలోగా నివేదిక అందించాలని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలపై స్పందించి విమర్శించారు. అలా మాట్లాడటం సరికాదని.. నాన్‌వెజ్ ఫుడ్ స్టాల్ మూసేయమనడం దౌర్జన్యమన్నారు. ఇలా తీసేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. కాగా.. బాల్ముకుంద్ హవా మహల్ అసెంబ్లీ స్థానం నుంచి 600 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఆర్ తివారీని ఓడించారు.
Satyendar Jain: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం కోర్టు..
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌లో పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో.. వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, దియాకుమారి, ఓం బిర్లాతో సహా ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో చాలా మంది పేర్లు చర్చలో ఉన్నాయి. అయితే అధిష్టానం ఎవరని ముఖ్యమంత్రిని చేస్తుందో……..