శాఖల కేటాయింపు తర్వాత సచివాలయానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఈ క్రమంలో.. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం.. ఆర్థిక శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read Also: R. Krishnaiah: సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు మద్దతు..
ఇదిలా ఉంటే.. నిన్న విద్యుత్ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు మంత్రులకు శాఖలు కేటాయింపు తర్వాత సచివాలయానికి వచ్చారు.
Read Also: MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి..