సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్ష కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూప కల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18లక్షల 46వేల 416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
Read Also: Video Viral: రైలులో మహిళతో కలిసి పోలీస్ అధికారి డ్యాన్స్.. వీడియో వైరల్
2 లక్షల 31 వేల 424 దరఖాస్తులు టీఎం33, టీఎం 15కు చెందినవి పెండింగ్ లో ఉన్నాయరని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ పై సమగ్ర అధ్యయనం చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ధరణిలో చాలా డేటా తప్పులు, పాసు బుక్స్ లో తప్పులు సవరించాలని ఆయన చెప్పారు. ధరణికి అసలు చట్టబద్ధత ఏంటని అధికారులను ప్రశ్నించారు. సాదా బైనామాల్లో తప్పు తొలగించాలి.. భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కంప్యూటర్లనే నమ్ముకోవద్దు, జమా బంది రాయాలి, రికార్డులు రాయాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read Also: Parliament security breach: నలుగురు కాదు ఆరుగురు.. పార్లమెంట్ దాడి ఘటనలో పరారీలో మరో ఇద్దరు..
మరోవైపు.. ధరణిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గ్రీవెన్స్ విధానాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భూ సమస్యలపై వినతులకు అందుబాటులోకి వచ్చిన మ్యాడ్యుల్లు, వాటి ద్వారా వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. పలు అంశాలపై క్లారిఫికేషన్, అదనపు సమాచారమడిగారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర వివరాలతో మరో నివేదిక తయారు చేయాలని ఆదేశం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.