తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. విద్యుత్ పై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించవచ్చని అన్నారు. ERC నియమ నిబంధన ప్రకారమే విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు లేదా నాలుగు గంటల కరెంటు ఇచ్చిన పరిస్థితి లేదని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లు పెట్టుబడిదారుల వైపు ఉన్నారు.. రైతుల వైపు ఎన్నడూ లేరని విమర్శించారు.
CM Revanth: యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశం
ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డిపై విమర్శలు సంధించారు. గత ప్రభుత్వంలో పవర్ లేని పవర్ మినిష్టర్ ఆయన అని జగదీష్ రెడ్డిని అన్నారు. విద్యుత్ వ్యవహరాలు మొత్తం ప్రభాకర్ రావు నడిపాడని.. యాదాద్రి ప్లాంట్ లో వాటా దారుడని కోమటిరెడ్డి అన్నారు. విచారణకు ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభాకర్ రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయమని అన్నారు. జైల్ కి పోతే జగదీష్ రెడ్డికి అర్థం అవుతోందని కోమటిరెడ్డి విమర్శించారు.
KP Nagarjuna Reddy: మార్కాపురంలో ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు..
అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు చేయాల్సిన పని మీరు చేశారు.. మేము చేయాల్సింది మేము చేస్తామన్నారు. సీఎం విచారణ చేస్తాం అన్నారు.. ఈ క్రమంలో వాళ్ళను చూస్తే బాధ అనిపిస్తుందని తెలిపారు. పాత కొత్త పార్టీ అంటున్నారు.. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కనుమరుగు అవ్వడం ఖాయమని విమర్శించారు. కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వారిని స్పీకర్ సముదాయించారు. మంచి ప్రాక్టీస్ కాదని అన్నారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ప్రతీ రోజు పోడియం దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నారు.. ఇదేం పద్దతి అని మండిపడ్డారు.