Minister Amarnath: దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని అన్నారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు, కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టం లేదని వివరించారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది, అప్పుడు తిరస్కరించారు.. ఆ విషయంలో వారిదే ఆఖరి నిర్ణయమని చెప్పారు.
Read Also: Indrakiladri: భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు సర్వం సిద్ధం
కాగా.. దాడి వీరభద్రరావు కాసేపటి క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను సైతం ముఖ్యమంత్రికి పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. వైసీపీకి రాజీనామా ప్రకటించిన దాడి వీరభద్రరావు ఫ్యామిలీ.. టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది.
Read Also: Y. V. Subba Reddy: గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మార్పు