AP Elections: ఏపీలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచుతోంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నేపధ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎస్, డీజీపీలు సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.
Read Also: YCP Joining: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బళ్ళారి మాజీ ఎంపీ
అంతేకాకుండా.. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష చేపట్టనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ పై సమీక్షించనున్నారు. రాజకీయ పార్టీలిచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షించనుంది. అక్రమ మద్యం, నగదు అక్రమ రవాణా, చెక్ పోస్టుల ఏర్పాటు, శాంతిభద్రతలపై సీఈసీ బృందం సమీక్షించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.