YSRCP: కాసేపట్లో మూడో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 22 నుంచి 25 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సీరియస్ గా కసరత్తు కొనసాగించింది పార్టీ అధిష్టానం. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా.. నియోజకవర్గ మార్పులు-చేర్పులు, సర్దుబాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడో జాబితా ప్రకటన చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఒక వైపు మార్పులు, చేర్పులు.. మరోవైపు బుజ్జగింపులు, సర్దుబాట్లు చేస్తుంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. పలువురు ఎమ్మెల్యేలు, నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. మూడు రోజులుగా నియోజకవర్గ సీట్లపై ముఖ్య నేతలతో సీఎం జగన్ చర్చించారు. ఈ రోజు కూడా పలువురు నేతలతో చర్చించారు.
Read Also: Kishan Reddy : దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోడీ అరికట్టారు
అందులో భాగంగానే.. నర్సరావుపేట పంచాయతీని పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సర్దుబాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పార్ధసారధి పార్టీ మారతారు అన్న ప్రచారంతో పార్టీ హైకమాండ్ అలెర్ట్ అయింది. దీంతో పార్థసారథితో రీజనల్ కో-ఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే కైలే సమావేశం అయి చర్చించారు. అనంతరం నేతలు సీఎంఓకు వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.