YSRCP: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట పంచాయతీ ముగిసింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సర్దుబాటు కసరత్తు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్న విజయసాయిరెడ్డి.. ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేశారాయన. అంతేకాకుండా.. పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయసాయి రెడ్డి వారికి సూచించారు.
Read Also: Round Table Meeting: సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం..
అనంతరం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. పంచాయతీ ముగిసింది అని చెప్పారు. కొంత మంది తన పట్ల అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవమని పేర్కొన్నారు. తాను ఎవరి పై అక్రమ కేసులు పెట్టించ లేదన్నారు. ఐదేళ్ళల్లో అందరికీ న్యాయం చేయలేమన్న గోపిరెడ్డి.. జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందుకోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు. అంతేకాకుండా.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళతానని అన్నారు. మరోసారి నర్సరావుపేట నుంచి తన గెలుపు ఖాయమని గోపిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Also: RS Praveen Kumar : టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి