డీఎంకే నేత, పల్లవరం ఎమ్మెల్యే ఐ.కరుణానిధి కోడలుపై పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్ల పని మనిషి చెన్నైలోని ఎమ్మెల్యే కోడలు దగ్గర పని చేస్తుంది. అయితే తనను వేధింపులకు గురి చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పని మనిషి తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేటకు చెందినదిగా గుర్తించారు. తనను ఎమ్మెల్యే కోడలు మార్లీనా పదే పదే వేధించిందని, అంతేకాకుండా కొన్నిసార్లు కొట్టేదని ఉలుందూరుపేట పోలీసులకు తెలిపింది.
TATA Group : తెలంగాణలో టాటా గ్రూప్ రూ.1500 కోట్ల పెట్టుబడులు
మార్లినా తనను నిత్యం చిత్రహింసలకు గురిచేసేదని, తన మామగారు శక్తిమంతుడని, ఫిర్యాదు చేసినా ఎవరూ రక్షించరని చెప్పిందని బాధిత మహిళ తెలిపింది. కొలపాక్కంలోని వారి నివాసంలో ఆంటో మతివన్నన్ అనే ఒక ఏజెంట్ తనకు ఉద్యోగం ఇప్పించాడని పోలీసులకు చెప్పింది. పొంగల్ సందర్భంగా తన యజమానులు తనకు జీతం ఇవ్వలేదని, వైద్య సహాయం కూడా అందించలేదని ఆమె ఆరోపించింది.
Krishnam Raju: మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలు.. ఫ్రీ మెడికల్ కాంప్
బాలిక దళిత కులానికి చెందినది కావడంతో ఈ సమస్యను దళిత హక్కుల సంస్థ ఎవిడెన్స్ చేపట్టి ఉలుందూరుపేటలోని ఎమ్మెల్యే కోడలు ఇంటికి సభ్యుల బృందాన్ని పంపించింది. ఎవిడెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కతీర్ మీడియాతో మాట్లాడుతూ.. తన స్వంత ఇష్టానుసారం ఉద్యోగాన్ని వదిలివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వడంతో ఆమె యజమానులు బాలికను ఆమె నివాసంలో దించారని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం మార్లినా, ఆంటో మతివన్నన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని.. బాలిక ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కతీర్ తెలిపారు. మరోవైపు.. మహిళ వాదలను ఎమ్మెల్యే కరుణానితి ఖండించారు. తన కొడుకు కుటుంబం ఆమెను బాగా చూసుకునేదని తెలిపారు. అంతేకాకుండా.. ఆమె చదువుకు సహాయం చేస్తున్నారని, నగలు, డబ్బులు ఇచ్చేవారని చెప్పారు.