లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్‌లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా.. తాజాగా…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలవు ప్రకటించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. "రాజకీయ ప్రచారం" కోసం సెలవులు మంజూరు చేశారని విమర్శించారు.
మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కారును ఓవర్‌టేక్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదాడు బాంధవ్గడ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(SDM). దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై 'బాలక్ రామ్' గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాటం.. నిరీక్షణ తర్వాత రామ్ లల్లా విగ్రహం సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్టించబడింది. కాగా.. అంతకుముందు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే రామమందిరంలో ప్రతిష్టబోయే ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ, ఆలయ ట్రస్ట్ ఆ విగ్రహం ఎలా ఉందో…
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎన్నో ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. సోమవారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట చేశారు. కాగా.. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారు. అంతేకాకుండా.. ప్రాణప్రతిష్ట జరగగానే రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు 'జై శ్రీరామ్.. జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్…
స్టాక్ మార్కెట్ ఈరోజు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల కారణంగా.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ కూడా 329 పాయింట్లకు చేరుకుని నష్టాల్లో ముగిసింది. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ క్షీణతలో రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి. అంతేకాకుండా.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. సుమారు మూడు శాతం పడిపోయాయి. అంతేకాకుండా.. దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లకు…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ…