ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో స్పీడు పెంచాయి. ఈ క్రమంలో.. తిరుపతిలో యాదవ సంఘాలతో వైసీపీ, టీడీపీ పోటాపోటీ సమావేశాలు నిర్వహించింది. యాదవ, కురుబ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరం ఎన్నడూ లేని విధంగా మహా నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. తనకు తెలియకుండా సత్యవేడు నేతలతో సమావేశం పెట్టడం, కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే నగరి తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టాగలరా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రిజర్వడ్ నియోజకవర్గాలంటే అంతా చిన్నచూపా అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే సీనియర్ లీడర్ తానని.. తనలా సర్పంచ్ గా గెలిచాడా.. ఎంపీటీసీ, ఎంపీపీగా…
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేని పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాను.. పాదయాత్ర ద్వారా ఉద్యమం చేశాను.. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేశానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాట్లాడితే కేసులు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను ఉప ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పిందని అన్నారు.…
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్ ఛాన్సలర్లు) నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా.. వీసీల పదవి కాలం మే లో ముగియనుంది. ఆ లోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది.
హైటెక్స్ వేదికగా ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు.. దేశ వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ కన్వెన్షన్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం హడావుడిగా కట్టింది అని.. అందుకే మూడు డ్యాంలకు ముప్పు ముంచి ఉందని అన్నారు. డ్రాయింగ్స్ ఎవరు…
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్-జూలియన్ రోజర్ రికార్డును బద్దలు కొట్టాడు. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే…
ఓ వైపు బీహార్ సంక్షోభం కాకరేపుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటన ఇండియా కూటమిలో మరో గందరగోళం సృష్టించేటట్లుగానే కనిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అఖిలేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది.
విశాఖలోని అరుకులో భారతదేశం భవిష్యత్తును రూపొందించే కీలకమైన విషయాలపై యంగ్ థింకర్స్ ఫారం చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పల్సస్ గ్రూప్ అధినేత గేదెల శ్రీనుబాబు పాల్గొని ఎలక్షన్ సీన్ ఫోకస్ నావిగేట్ ఇన్ ది డెమొక్రటిక్ మేజ్, ప్రజాస్వామ్యం యువత యొక్క పాత్ర అనే అంశాలపై ప్రసంగించారు. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించటానికి ఇది మంచి వేదిక అని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఒక్క పాలన యొక్క రూపం మాత్రమే కాదు.. ఇది ఒక భావజాలం ప్రతి పౌరునికి శక్తిని…
గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇద్దరు ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్‌గా రాజకీయ పార్టీలను ఆయన ఏకతాటిపైకి తీసుకు వచ్చారు.
సచివాలయంలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని అధికారులకు తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలో.. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్…